ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పరదాలు లేకుండా రోడ్లపై లారీలెత్తుకుంటే చర్యలు తప్పవు: మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి

పరదాలు లేకుండా రోడ్లపై లారీలెత్తుకుంటే చర్యలు తప్పవు: మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి

మణుగూరు,ఆధాబ్ న్యూస్: బొగ్గు, ఇసుక లారీలు పరదాలు లేకుండా రోడ్డుపై నడిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలకు దుమ్ము, ధూళి వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, వాహనదారుల నిర్లక్ష్యం భరించబోమని స్పష్టం చేశారు.

ఎస్సైలు, సీఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వాహనాలు పరదాలు లేకుండా ప్రయాణిస్తే తక్షణమే లారీని ఆపి, పత్రాలను స్వాధీనం చేసుకుని లారీ పక్కన ఉంచాలన్నారు. డ్రైవర్లపై అవసరమైతే కేసులు నమోదు చేయాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని, నిబంధనలు లక్ష్యం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!