ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సింధూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సింధూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన సింధూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో పినపాక శాసనసభ్యుల పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకొని, అభిషేకాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఆయనకు ఘన ఆదరణ లభించింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, యర్ర సురేష్, రాందాస్ నాయక్, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పూజ కార్యక్రమం అనంతరం గ్రామస్థులతో ఎమ్మెల్యే పలు విషయాలపై చర్చించి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!