మణుగూరు పివి కాలనీలో దొంగల హల్చల్ – నాలుగు ఎంసీ క్వార్టర్లలో చోరీలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్: మణుగూరు పివి కాలనీ పరిధిలోని నాలుగు ఎంసీ క్వార్టర్లలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గుర్తు తెలియని దొంగలు క్వార్టర్లలో ప్రవేశించి బంగారు ఆభరణాలు, గ్యాస్ సిలిండర్లు, టీవీలు, లాప్‌టాప్ సహా అనేక విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మణుగూరు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మేడా ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Post Views: 41









