సారపాకలో రోడ్డు ప్రమాదం – కల్వర్టును ఢీ కొట్టిన లారీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలం సారపాక సంత సమీపంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ను తప్పించబోయిన లారీ, అదుపు తప్పి రోడ్డుకెరువు వద్ద ఉన్న కల్వర్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధిత డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదంతో లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Post Views: 42









