ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ తప్పనిసరి: జిల్లా రవాణా అధికారి వెంకటరమణ

ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ తప్పనిసరి: జిల్లా రవాణా అధికారి వెంకటరమణ
కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లాలోని ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా రవాణా అధికారి వెంకటరమణ స్పష్టం చేశారు. మంగళవారం నాడు కొత్తగూడెం జిల్లా రవాణా కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. స్కూల్ బస్సుల డ్రైవర్లకు ఫిట్నెస్, రహదారి భద్రత అంశాలపై మార్గనిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి డ్రైవర్ వాహనం నడిపే ముందు బస్సు ఫిట్నెస్‌ను చెక్ చేసుకోవాలి. పిల్లల భద్రతకు ఇది అత్యంత అవసరం. ప్రతి బస్సులో ఒక అటెండెంట్ ఉండటం తప్పనిసరి. అలాగే డ్రైవర్లు ప్రతి నెల తమ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలి” అని సూచించారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర నేరమని ఆయన హెచ్చరించారు. చట్ట ప్రకారం విధిగా వ్యవహరించాలని, స్కూల్ యాజమాన్యాలు మరియు డ్రైవర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.

ఈ సందర్భంగా స్కూల్ బస్సులకు పాటించవలసిన నియమాలు, భద్రతా సూచనలపై కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు బస్సు డ్రైవర్లు, స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!