జిల్లా కలెక్టర్ బూర్గంపహాడ్ గురుకుల పాఠశాలను పరిశీలన
విద్యార్థుల సౌకర్యాలపై కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక దృష్టి
బూర్గంపహాడ్, ఆధాబ్ న్యూస్:
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాలపై మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు.
ప్రధానంగా మంచినీటి సమస్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పాఠశాల చుట్టూ మునగ మొక్కలతో పాటు ఇతర వృక్షాలను నాటాలన్న సూచనలు చేశారు.
ఇంకుడు గుంతల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, కొత్తగా పలు ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలని, ప్రహరీ గోడల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
పాఠశాలలో చేపట్టాల్సిన పలు నిర్మాణాలు, అభివృద్ధి పనులు పాఠశాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ITC అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సందర్శనలో పలు శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు









