ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద లబ్ధిదారులకు ఇళ్లు అందించాలన్న దిశగా చేపట్టిన నిర్మాణ పనులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామంలో లబ్ధిదారుడు కొమరం వెంకటేశ్వర్లు w/o సావిత్రి ఇంటి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు పథకం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. బేస్ మీట్ పూర్తయిన వెంటనే రూ.1 లక్ష లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నాం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









