ఈనెల 18 వరకు భద్రాద్రి జిల్లాలో వర్ష సూచన
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, ఈనెల 18వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.
పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలుచోకూడదని హెచ్చరించారు.
Post Views: 98









