ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహనా ర్యాలీ

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు
జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం హెచ్ ఈ ఓ కృష్ణయ్య పర్యవేక్షణలో జరిగింది. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇందులో భాగస్వాములయ్యారు.
ర్యాలీలో ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వివిధ ఆరోగ్య నినాదాలు వినిపించాయి:

దోమకాటు – ప్రాణాంతకం

నీటి నిల్వలు – దోమలకు ఆశ్రయాలు

శుభ్రతే రక్షణ – డ్రై డే పాటిద్దాం

ఆరోగ్యమే మహాభాగ్యం

వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఫార్మసిస్ట్ సునీల్, లక్ష్మి, MPHA పద్మ, రుక్మిణి, సుజాత, రమాదేవి, జ్యోతి, MPHA(G) నర్సింహారావు, ఆశా కార్యకర్తలు గణపతమ్మ, మంగవేణి, ఖగదేశ్వరి, జయమ్మ, అసిల సరిత, పుణ్యావతి తదితరులు. అలాగే 108 పైలట్ సాయి కూడా పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!