పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆహ్వానించిన మాల మహానాడు నాయకులు
మణుగూరు, మే 16: ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మే 25న భద్రాచలం కె.కె. ఫంక్షన్ హాల్లో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సు మరియు నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అద్దంకి దయాకర్‌కు జరగనున్న ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తొటమల్ల రమణమూర్తి, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 85









