ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్)లో ఈరోజు ఓ ప్రత్యేక సందర్భం జరిగింది. కరకగూడెం మండలానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, తన ద్వితీయ కుమారుడు సయ్యద్ అస్లాం హుస్సేన్ వివాహానికి ఆహ్వానిస్తూ, నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశాడు.
ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేను హృదయపూర్వకంగా ఆహ్వానించి, వివాహ వేడుకకు హాజరయ్యేలా కోరారు.
Post Views: 37









