సూర్యాపేటలో ఏసీబీ దాడులు: డీఎస్పీ, సీఐ అదుపులోకి
సూర్యాపేట, ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట జిల్లా డీఎస్పీ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఓ మెడికల్ కేసు పరిష్కారానికి సంబంధించి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలపై, సూర్యాపేట సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారథి లపై ఆరోపణలు వెల్లడి అయ్యాయి.
బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారులు కేసును విచారించారు. విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్టు నిర్ధారణ కావడంతో, సీఐ, డీఎస్పీని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి 16 లక్షల రూపాయల చెల్లింపుపై ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో, ఇద్దరి అధికారుల ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు జరిపింది. ఈ దాడులను ఏసీబీ డీఎస్పీ జగదీష్ నేతృత్వంలో నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడం నేరమని ఆయన స్పష్టం చేశారు.
Post Views: 127









