ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ములుగు జిల్లాలో మందుపాతర పేలుడు: ముగ్గురు పోలీసుల మృతి, పలువురికి గాయాలు

ములుగు జిల్లాలో మందుపాతర పేలుడు: ముగ్గురు పోలీసుల మృతి, పలువురికి గాయాలు

ములుగు,మే8 ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వాజేడులో గురువారం ఉదయం జరిగిన మందుపాతర పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మావోయిస్టుల బీభత్సంలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు హతమవగా, అదే నేపథ్యంలో వెంకటాపురం పరిసర అడవుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ముందుగా మందుపాతర పేల్చి, అనంతరం కాల్పులకు తెగబడ్డారు.

పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండగా, ఘటనా స్థలానికి అధిక పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్