ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఇందిరమ్మ ఇంటి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్.

పినపాక, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పురస్కరించుకొని, పినపాక మండలం గొట్టెల్లా గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ఇర్ప లక్ష్మి ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు పాల్గొన్నారు.

ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిందని, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని వారు హైలైట్ చేశారు. పినపాక నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ పథకం ద్వారా సొంతఘరం కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారురాలైన ఇర్ప లక్ష్మికి నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పినపాక ఎమ్మార్వో అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోడిశాల రామనాధం, మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….