ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ

పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల జన్మదినాన్ని పురస్కరించుకుని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. బయ్యారం క్రాస్ రోడ్ వద్ద భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ప్రజాసేవే తన ధ్యేయమని తెలిపారు.

తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో అన్నదానం, వైద్య శిబిరాలు, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమాల నిర్వహణలో పాలుపంచుకున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్