మృత ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
కరకగూడెం, అక్టోబర్ 1, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలకుర్తి బాలకృష్ణ (బాలు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దశదినకర్మల సందర్భంగా బాధిత కుటుంబానికి ఆటో యూనియన్ తరఫున రూ.5,000, కరకగూడెం ఎస్‌ఐ పివిఎన్ రావు తరఫున రూ.5,000 కలిపి మొత్తం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తమ వంతు సహకారం అందించి, కుటుంబానికి అండగా నిలిచారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కొమరం సాంబశివరావు, కార్యదర్శి గుడ్ల రంజిత్ కుమార్, ఆటో డ్రైవర్లు కోలగాని రవి, బాదె సాగర్, బెజవాడ రాములు, బందు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 229









