ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  కరకగూడెం మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరసన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్.. అనంతారంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో నినాదాలు

కరకగూడెం మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరసన

ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్.. అనంతారంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో నినాదాలు

కరకగూడెం, సెప్టెంబర్ 3 (ఆధాబ్ న్యూస్): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున 33 నెలలకు రూ.82,500, వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ బకాయిలు, దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం వంటి హామీలు బాకీ ఉన్నాయని ఆరోపించారు.

అలాగే విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు, రైతు భరోసా, దళితబంధు, పంటలకు రూ.500 బోనస్ వంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున భృతి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల భృతి వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించకుండా వెంటనే అమలు చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు