ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచ్‌కు ఘన సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచ్‌కు ఘన సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: CEO 
కరకగూడెం మండలం సమత్ మోతె (గొల్లగూడెం) గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు, మహిళా వార్డు సభ్యులు కలిసి స్థానిక మహిళా సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు విద్య, రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సమాజం మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు.

గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని, మహిళలు ఐక్యంగా ఉంటే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జిమ్మిడి విజయ్, అంగన్వాడీ టీచర్ కుంజ సావిత్రి, వీఓ సభ్యులు తోలెం సత్యవతి, వార్డు సభ్యులు గుడ్ల రంజిత్, గ్రామ మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్