హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నివాసంలో జరిగిన భేటీలో సీతక్క పుష్పగుచ్చం అందజేసి రేవంత్ రెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని తెలిపారు. ప్రజల అభీష్టాలను నెరవేర్చే నాయకుడిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సీతక్క శుభాకాంక్షలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 31









