ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలు

గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రగతిశీల జనపక్ష పాలన పునరాగమనానికి బాటలు వేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు శనివారం (25-10-2025) కరకగూడెం మండలంలోని చిరుమల్ల, వట్టంవారి గూంపు పంచాయతీల్లో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వట్టం వెంకటేశ్వర్లు, పాయం నర్సింహారావు, వట్టం సమ్మయ్య, సోషల్ మీడియా అధ్యక్షుడు సిద్ధి సునిల్ నేతృత్వం వహించారు.

ఇసందర్భంగా వారు మాట్లాడుతూ –
ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయినా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్కటైనా పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. ప్రజలను ఆశలు పెట్టించి మోసం చేసిన ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్య సమస్యలు పెరిగిపోతున్నాయని, ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరడం భవిష్యత్ బీఆర్ఎస్ విజయానికి నాంది అని పేర్కొన్నారు. ప్రజానునయ పాలనను తిరిగి తీసుకురావడానికి పార్టీ పటిష్టంగా సిద్ధమవుతోందని తెలిపారు.

కార్యక్రమంలో ఊకే వసంతరావు, బోడ రవి, గొంది లక్ష్మణరావు, అరేం కృష్ణమూర్తి, కుంజా నాగేంద్రబాబు, నారాయణ, మంకిడి శోభన్, బిజ్జా రామకృష్ణ, వట్టం ముత్తయ్య, ఊకే జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్