తాండూర్ లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం: ముగ్గురి అరెస్ట్.
తాండూర్,ఆధాబ్ న్యూస్:
తాండూర్ లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం: ముగ్గురి అరెస్ట్
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం రేపల్లె వాడ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, సుమారు రూ 40 వేల విలువైన పొగాకు ప్యాకెట్లతో కూడిన మారుతి వ్యాన్ ను గుర్తించారు. ఈ కేసులో అదిలాబాద్ కు చెందిన అదిల్, ఫయాజ్, రాజు అనే ముగ్గురిని అరెస్ట్ చేసి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Post Views: 31









