ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక గోశాలల ఏర్పాటు – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక గోశాలల ఏర్పాటు – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోసంరక్షణ, నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి మార్గదర్శక ప్రక్రియలు రూపొందించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని సూచించారు.

ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, గోశాలల నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు, స్థలాల గుర్తింపు వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గోశాలల ఏర్పాటు కోసం అంధబావుట్‌లోని 50 ఎకరాల స్థలాన్ని ఉపయోగించాలనీ, ఇతర ఖాళీ ప్రభుత్వ భూములవైనా, స్వచ్ఛంగా తిరిగిన భూములవైనా వినియోగించుకోవచ్చని తెలిపారు.

విశేషంగా:

గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలు, కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోడల్ గోశాలలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో గోశాల కోసం చేపట్టిన మోడల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇది నూతనంగా నిర్మించనున్న గోశాలలకు ఆదర్శంగా నిలవనుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో గోశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి సమర్థమైన నిర్వహణ వ్యవస్థను రూపొందించి, సక్రమంగా అమలు చేయాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్