ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేష్

నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేష్

అమరావతి, ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలోని యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలను పొందేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవ‌కాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.

సివిల్ డెవలప్మెంట్, కార్పొరేట్ రంగం, న్యాయ, సీఏ, ఓంకాలజీ వంటి విభాగాలలో నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నైపుణ్య పోర్టల్‌ను ‘సింగిల్ ప్లాట్‌ఫామ్’గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

తద్వారా ఉద్యోగ కల్పనకు సంబంధించిన అన్ని రంగాల వారితో తార్కికమైన కుదుర్పాటు ఏర్పరిచి జిల్లా వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు బహుళపంథాల ద్వారా నైపుణ్య శిక్షణ పొంది ఉపాధిని పొందేలా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు నారా లోకేష్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు