భద్రాచలం కరకట్టపై ఆవుల వ్యాను బోల్తా: ఆవులకు గాయాలు
భద్రాచలం, మే 14 ఆధాబ్ న్యూస్: భద్రాచలం పట్టణంలోని కరకట్ట మార్గంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో వాహనానికి స్వల్పంగా నష్టం వాటిల్సినప్పటికీ, వాహనంలో ఉన్న ఆవులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో పదికి పైగా ఆవులు ఉన్నట్లు సమాచారం.
ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఆవులకు నీరు ఇవ్వడంతో పాటు తగిన సహాయం అందించారు. వాహనం ఎలా వచ్చిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా జంతువుల రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 48









