ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మేడే సందర్భంగా మణుగూరు వంద పడకల ప్రభుత్వ దవాఖానాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేస్తూ, వారి సేవలను స్మరించుకున్నారు.
ఎమ్మెల్యేకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ మరియు వైద్య సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన సెమీ ఆటోమేటిక్ బయో కెమికల్ అనలైజర్ మిషన్, నూతన ఫ్రిజ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హాస్పిటల్‌ను శుభ్రంగా ఉంచుతూ, రోగులకు కుటుంబ సభ్యుల్లా సేవలందిస్తున్న శానిటైజ్ కార్మికుల ధైర్యాన్ని ప్రశంసించారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని చెప్పారు.
హాస్పిటల్ సేవలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా గైనకాలజిస్ట్‌ను నియమించామని, ఈ నెలలోనే 50కి పైగా ప్రసవాలు జరిగాయని తెలిపారు. ఓపీ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.

కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, నర్సులు, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….