అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడి మృతి
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: మండలంలోని కలవలనాగారం గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తులు బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో కలకలం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Post Views: 47








