ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కరకగూడెం మండలంలో కర్ర మిషన్లపై నిఘా ఎక్కడ? అనుమతులు లేకుండానే నిర్వహణ సాగుతోందా?

కరకగూడెం మండలంలో కర్ర మిషన్లపై నిఘా ఎక్కడ?

అనుమతులు లేకుండానే నిర్వహణ సాగుతోందా?

టేకు కలపతో మంచాలు, డబుల్‌కాట్ బెడ్‌లు, డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ తయారీ

అటవీ, విద్యుత్ శాఖల అధికారుల తనిఖీలు ఎక్కడ?

కరకగూడెం మండలం, అక్టోబర్ 11 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలంలో కొన్ని కర్ర మిషన్ల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ర మిషన్ ఏర్పాటు చేసి నిర్వహించేందుకు అటవీశాఖ అనుమతి, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, స్థానిక సంస్థల అనుమతులు, విద్యుత్ కనెక్షన్ తదితర నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఈ నిబంధనలు అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా కర్ర మిషన్లలో టేకు దుంగలను కోసి మంచాలు, డబుల్‌కాట్ బెడ్‌లు, డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ తదితర విలువైన ఫర్నిచర్‌ను తయారు చేస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కలప ఎక్కడి నుంచి వస్తోంది? అటవీశాఖ నిబంధనల ప్రకారం కలప కొనుగోలు బిల్లులు, రవాణా అనుమతులు, ట్రాన్సిట్ పర్మిట్లు, స్టాక్ రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కర్ర మిషన్ నిర్వహణకు సంబంధిత అటవీశాఖ లైసెన్స్‌తో పాటు అవసరమైన ఇతర అనుమతులు ఉండాలి. అలాగే కాలుష్య నియంత్రణ మండలి నుంచి అవసరమైన అనుమతులు, స్థానిక సంస్థల అనుమతులు, విద్యుత్ శాఖ నుంచి నిబంధనలకు అనుగుణమైన విద్యుత్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. అయితే కొన్ని కర్ర మిషన్ల విషయంలో ఈ అనుమతులు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ విద్యుత్ వినియోగంపై ఆరోపణలు

కొన్ని కర్ర మిషన్లలో విద్యుత్‌ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సంబంధిత విద్యుత్ అధికారులు తనిఖీలు నిర్వహించి కనెక్షన్లు సక్రమంగా ఉన్నాయా? మీటర్లు, లోడ్, వినియోగ విధానం నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

అధికారుల తనిఖీలు చేపట్టాలి

కరకగూడెం మండలంలోని కర్ర మిషన్లపై అటవీశాఖ, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ, సంబంధిత స్థానిక సంస్థల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. కర్ర మిషన్లకు అనుమతులు ఉన్నాయా? కలపకు సంబంధించిన బిల్లులు, రవాణా పత్రాలు ఉన్నాయా? టేకు కలప మూలం ఏమిటి? విద్యుత్ కనెక్షన్ నిబంధనల ప్రకారం ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు.

అటవీ సంపదకు నష్టం కలిగించే అక్రమ కలప రవాణా, నిల్వలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కర్ర మిషన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు