ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  షార్ట్ సర్క్యూట్‌తో ఆటోమొబైల్ షాప్ దగ్ధం రూ.5 లక్షల ఆస్తి నష్టం.. ప్రభుత్వ సాయం అందించాలని బాధితుడి వేడుకోలు

షార్ట్ సర్క్యూట్‌తో ఆటోమొబైల్ షాప్ దగ్ధం

రూ.5 లక్షల ఆస్తి నష్టం.. ప్రభుత్వ సాయం అందించాలని బాధితుడి వేడుకోలు

తాడ్వాయి, ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లా తాడ్వాయి (సమ్మక్క–సారలమ్మ) మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఇర్ప సూర్యబాబుకు చెందిన ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ షాప్ శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో షాప్‌లోని సామగ్రి మొత్తం కాలిపోవడంతో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.

షాప్ దగ్ధం కావడంతో తన కుటుంబానికి ప్రధాన జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడ్డామని సూర్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.

ప్రమాదం జరిగిన స్థలాన్ని సంబంధిత GPO తక్షణమే పరిశీలించి, నష్టానికి సంబంధించిన నివేదికను తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి నష్టపోయిన పేద కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు