ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కలవలనాగారంలో 800 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకం ధ్వంసం నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎక్సైజ్‌ సీఐ నాగేశ్వరరావు

కలవలనాగారంలో 800 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకం ధ్వంసం

నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎక్సైజ్‌ సీఐ నాగేశ్వరరావు

కరకగూడెం, అక్టోబర్‌ 10 (ఆధాబ్‌ న్యూస్‌): కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామంలో అక్రమంగా పులియబెట్టిన బెల్లం పానకంపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. మణుగూరు ఎక్సైజ్‌ స్టేషన్‌, ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కొత్తగూడెం డీటీఎఫ్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 800 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా మణుగూరు ఎక్సైజ్‌ సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అక్రమంగా పులియబెట్టిన బెల్లం పానకాన్ని తయారు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా తయారీకి అవసరమైన ముడి సరుకులను విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

ఈ దాడుల్లో మణుగూరు ఎక్సైజ్‌ ఎస్సై విజయభాస్కర్‌, ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై శ్రీనివాసరావు, కొత్తగూడెం డీటీఎఫ్‌ ఎస్సై సమీవుల్లా ఖాన్‌, సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్‌, వీరబాబు, నరేష్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

— ఆధాబ్‌ న్యూస్‌ ప్రతినిధి..విజయ్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు