శనివారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు, స్మార్ట్ కార్డుల పంపిణీ
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పంపిణీ
కరకగూడెం, అక్టోబర్ 9, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు, రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వట్టం కాంతయ్య తెలిపారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మండలంలోని 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 5,242 కుటుంబాలకు రేషన్ స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, పాత్రికేయులు హాజరై విజయవంతం చేయాలని తహసీల్దార్ వట్టం కాంతయ్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
Post Views: 30









