పస్రా–తాడ్వాయి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం
ములుగు, అక్టోబర్ 8 (ఆధాబ్ న్యూస్):
ములుగు జిల్లా పస్రా–తాడ్వాయి మధ్య అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ అదుపుతప్పి సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రమాదం అనంతరం పస్రా వైపు వెళ్తున్న ఓ కారును కూడా అదే లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Views: 67









