ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  అక్రిడిటెడ్ కార్డుల మంజూరుపై ఆరోపణలు.. సమగ్ర విచారణకు డిమాండ్ అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి: మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ

అక్రిడిటెడ్ కార్డుల మంజూరుపై ఆరోపణలు.. సమగ్ర విచారణకు డిమాండ్

అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి: మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ

మణుగూరు, అక్టోబర్ 5 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రిడిటెడ్ జర్నలిస్టు కార్డుల మంజూరు ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు మంజూరయ్యాయనే చర్చ జర్నలిస్టు వర్గాల్లో జరుగుతోందన్నారు. జిల్లాలో సుమారు 800 వరకు అక్రిడిటెడ్ కార్డులు మంజూరైనట్లు పేర్కొంటూ, వాటి మంజూరు ప్రక్రియ, అర్హతలు, దరఖాస్తులు, పత్రాల పరిశీలన, పత్రికల సర్క్యులేషన్ తదితర అంశాలపై పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు.

అక్రిడిటెడ్ కార్డుల మంజూరులో నిజంగా పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాధాన్యత లభించిందా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని ఆమె అన్నారు. కొన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటి వాస్తవాలను అధికారిక విచారణ ద్వారా తేల్చాలని కోరారు.

కార్డుల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులు, సమర్పించిన పత్రాలు, పత్రికల సర్క్యులేషన్ వివరాలు, వర్కింగ్ జర్నలిస్టుల పని చేస్తున్నట్లు నిర్ధారించే రికార్డులు, సంబంధిత కమిటీ నిర్ణయాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని దుర్గ విజ్ఞప్తి చేశారు.

విచారణలో అర్హత లేని వారికి అక్రిడిటెడ్ కార్డులు మంజూరైనట్లు తేలితే నిబంధనల ప్రకారం వాటిని రద్దు చేసి, నిజంగా పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

“వర్కింగ్ జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేను ఉంటాను. ఏ యూనియన్‌తో సంబంధం లేకుండా జర్నలిస్టుల హక్కుల కోసం నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తాను” అని దుర్గ స్పష్టం చేశారు.

అక్రిడిటేషన్ కార్డుల మంజూరు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అంకిత్ సీరియస్‌గా స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు