ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం ప్రాథమిక విద్య, బడి సంసిద్ధతతో పిల్లలకు మంచి భవిష్యత్తు

కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం

ప్రాథమిక విద్య, బడి సంసిద్ధతతో పిల్లలకు మంచి భవిష్యత్తు

ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తొలెం రమేష్

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: మండల కేంద్రంలోని అశ్వాపురంపాడు గ్రామంలో శ్రీనివాస్ కీర్తి, శ్యామ్ మోహన్ సహకారంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తొలెం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్‌ను గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక సర్పంచ్ పోలెబోయిన సుజాతతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తొలెం రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తులో ఎదగాలంటే విద్య తొలి మెట్టు అని అన్నారు. ప్రతి చిన్నారి మంచి నడవడికతో చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యకు దూరం చేయకూడదని, ఆదివాసీ పిల్లల విద్యాభివృద్ధికి తమ సంస్థ తరఫున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నేటి విద్యే రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తొలెం రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ప్రతిరోజూ తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గొగ్గలి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు ఇర్ప ప్రకాష్, బట్టా బిక్షపతి, పాఠశాల విద్యా వాలంటీర్ ఊకే నాగమణి, సారయ్య, గ్రామస్థులు చందు, సుధీర్, కేశవరావు, కన్ను, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు