ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకులు మేడ మోహన్‌రావు

బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకులు మేడ మోహన్‌రావు

చండ్రుగొండ, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మేడ మోహన్‌రావు ఖమ్మంలోని ఆసుపత్రిలో పరామర్శించారు.

బెండలపాడు గ్రామానికి చెందిన చీదర్ నవీన్ వాలీబాల్ ఆడుతుండగా కాలికి గాయం కావడంతో నరం తెగి గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా బెండలపాడు గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు పొడెం శేఖర్‌రావు బెండలపాడు నుంచి చండ్రుగొండకు బైక్‌పై వెళ్తుండగా గేదె అడ్డురావడంతో బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన కుడిచేయి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సందర్భంగా మేడ మోహన్‌రావు ఇద్దరినీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మండల యువజన నాయకుడు భానోత్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు