ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  అశ్వాపురం పాడులో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలి: మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి

అశ్వాపురం పాడులో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలి: మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సారథ్యంలో కరకగూడెం పోలీసులు అశ్వాపురం పాడు గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ రవీందర్ రెడ్డి సమావేశమై, అశ్వాపురం పాడు గ్రామంలో గత ఏడాది కాలంగా చోటుచేసుకున్న వరుస సంఘటనలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ, చట్టానికి లోబడి జీవించాలని సూచించారు. ఎవరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్టాన్ని అతిక్రమించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణతో మెలుగుతూ గ్రామంలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరారు.

అనంతరం గ్రామంలోని సుమారు 50 మంది చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. చిన్నారులతో పోలీసులు ఆప్యాయంగా మెలిసి, వారికి దుస్తులు అందజేశారు.

కార్యక్రమంలో ఎడూళ్ల బయ్యారం సీఐ ఈ. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్‌ఐ పి.వి.ఎన్. రావు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు