ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి

– జిల్లా కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం ఆధాబ్ న్యూస్: సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని కోరారు.

ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు వెంటనే స్వీకరించి, వాటిపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు.

జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు