ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కంటైనర్‌ను ఢీకొట్టిన అడిషనల్‌ కలెక్టర్‌ కారు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన వేణుగోపాల్‌

కంటైనర్‌ను ఢీకొట్టిన అడిషనల్‌ కలెక్టర్‌ కారు

ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన వేణుగోపాల్‌

నార్కట్‌పల్లి, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ముందుగా వెళ్తున్న కంటైనర్‌ యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన అడిషనల్‌ కలెక్టర్‌ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. అయితే వేణుగోపాల్‌ సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న కారును ఇన్సూరెన్స్‌ ప్రక్రియ నిమిత్తం అక్కడే ఉంచారు. అనంతరం పోలీసులు వేణుగోపాల్‌కు అల్పాహారం ఏర్పాటు చేశారు. సివిల్‌ సప్లైస్‌ అధికారి కారులో ఆయన కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు