ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కరకగూడెం మండలంలో ఘనంగా వినాయక సంబరాలు లడ్డూ వేలంపాటల్లో భక్తుల ఉత్సాహం.. పోటాపోటీగా వేలం

కరకగూడెం మండలంలో ఘనంగా వినాయక సంబరాలు

లడ్డూ వేలంపాటల్లో భక్తుల ఉత్సాహం.. పోటాపోటీగా వేలం

కొత్తూరులో రూ.46 వేలు.. మోతెలో రూ.30,116కు లడ్డూలు సొంతం

కరకగూడెం, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కొత్తూరు, అనంతారం, మోతె, ముత్తారం, శ్రీరంగాపురం, గొల్లగూడెం గ్రామాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం లడ్డూ వేలంపాటలు ఉత్సాహంగా నిర్వహించారు.

కొత్తూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాటలో గొగ్గల రామకృష్ణ–స్వర్ణలత దంపతులు రూ.46,000లకు వినాయకుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.

అనంతారం గ్రామంలో నిర్వహించిన లడ్డూ వేలంపాటలో సలగు బిక్షపతి రూ.26,000లకు లడ్డూను దక్కించుకున్నారు.

అదేవిధంగా మండలంలోని ఇతర గ్రామాల్లో నిర్వహించిన లడ్డూ వేలంపాటల్లో కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

  • మోతె గ్రామం: పి. శ్రీనివాసరెడ్డి — రూ.30,116
  • ముత్తారం గ్రామం: కల్తి శ్రీకాంత్ — రూ.30,000
  • శ్రీరంగాపురం గ్రామం: కుమ్మరి కుమార్ — రూ.5,116
  • గొల్లగూడెం గ్రామం: దబ్బగట్ల బుచ్చయ్య — రూ.5,001

లడ్డూ వేలంపాటలు పోటాపోటీగా సాగడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. లడ్డూలను దక్కించుకున్న భక్తులను గ్రామస్తులు అభినందించారు.

అనంతరం నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి గీతాలు, డప్పు చప్పుళ్లు, నినాదాలతో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వేడుకలను ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామాల్లోని యువత, ఉద్యోగులు, గ్రామస్తులు సమన్వయంతో వినాయక ఉత్సవాలను విజయవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు