సాయిబాబా ఆలయానికి రూ.3.5 లక్షల విలువైన రథం బహూకరణ
తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
సారపాక, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): బూర్గంపాడు మండలం సారపాకలోని షిరిడి పుష్కర ద్వారక సాయిబాబా ఆలయానికి తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3.5 లక్షల విలువైన రథాన్ని బహూకరించారు.
గురువారం ట్రస్ట్ ఛైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ–విజయరేణుక దంపతులు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సమర్పించిన రథాన్ని ఆలయ కమిటీ బాధ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ తమ కుమారుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్–నీలిమ దంపతుల సౌజన్యంతో స్వామివారికి రథాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఆలయానికి రథాన్ని అందించడం ఆనందంగా ఉందని, భక్తులకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగమనేని భాస్కరరావు, తీగల జీవన్‌రెడ్డి, ఊటుకూరి రమణమూర్తి, అక్కెర భాస్కరాచారి, కొత్తపల్లి సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.









