గోండి భాష పరిరక్షణకు వర్క్‌షాప్
గోండి భాషకు 8వ షెడ్యూల్లో గుర్తింపు కల్పించాలి
భాషా, సంస్కృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
భద్రాచలం, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి.సి. దొర, కోశాధికారి సోలం రామారావు అన్నారు. గోండి భాషను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు భద్రాచలంలోని గిరిజన భవన్లో గోండి భాష వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ 3898/90, గోటుల్ గోండ్వానా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో గోండి భాష పరిరక్షణ, అభివృద్ధి, భావితరాలకు భాషను అందించే అంశాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గోండి భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అధికారిక గుర్తింపు కల్పించి చేర్చాలని వారు డిమాండ్ చేశారు. గోండి భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
గోండి భాషపై ఆసక్తి ఉన్న ఆదివాసీ యువత, విద్యార్థులు, భాషాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ డాక్టర్ చందా లింగయ్య దొరను నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలిపారు.
ఆదివాసీ భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వి.సి. దొర, సోలం రామారావు కోరారు.









