తాటిగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు
గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన
కరకగూడెం, సెప్టెంబర్ 23 (ఆధాబ్ న్యూస్): మణుగూరు ప్రాజెక్టు పరిధిలోని కరకగూడెం మండలం అనంతారం సర్కిల్ తాటిగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో వివిధ రకాల ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవల గురించి తల్లులకు వివరించారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజమణి, సర్పంచ్ కొమరం విజయ, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.
Post Views: 22









