ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులపై విచక్షణారహిత దాడి…

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులపై విచక్షణారహిత దాడి

ఏటూరునాగారం, సెప్టెంబర్ 21 (ఆధాబ్ న్యూస్): ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులపై దాడి ఘటన కలకలం రేపింది. రాత్రి స్టడీ సమయంలో 6, 7వ తరగతులకు చెందిన పలువురు విద్యార్థినులను 9వ తరగతికి చెందిన ఓ బాలిక కర్రతో విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం.

ఈ ఘటనలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి సమయంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.

వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం

రాత్రి సమయంలో విద్యార్థినులను పర్యవేక్షించాల్సిన వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మెన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

వరుస ఘటనలపై ఆదివాసీ సంఘాల ఆగ్రహం

కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఐటీడీఏకు సమీపంలోని ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల భద్రతపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా కఠిన చర్యలు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు