రౌడీషీటర్లకు డీఎస్పీ వెంకన్నబాబు కౌన్సిలింగ్
ఇల్లందు, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):
ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్ల ప్రవర్తన, వారి కార్యకలాపాలపై ఆరా తీశారు.
ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని డీఎస్పీ సూచించారు. ప్రజలను బెదిరించడం, దాడులకు పాల్పడటం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకన్నబాబు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని తెలిపారు.
Post Views: 18









