ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  పాత కక్షలతో వ్యక్తిపై దాడి కత్తులు, గొడ్డళ్లతో దాడి.. ప్రాణాపాయ స్థితిలో భీమరాజు

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

కత్తులు, గొడ్డళ్లతో దాడి.. ప్రాణాపాయ స్థితిలో భీమరాజు

కరకగూడెం, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని అశ్వాపురంపాడు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో భీమరాజుపై కత్తులు, గొడ్డళ్లతో దాడి జరిగినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. సుమారు మూడు నెలల క్రితం అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన పెద్దమనిషి వెంకటేశ్వర్లుపై దాడి జరిగి మృతి చెందిన ఘటనకు సంబంధించిన కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఘటనకు ప్రతీకారంగా వెంకటేశ్వర్లు కుమారుడు తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో కలిసి భీమరాజుపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

భీమరాజు శనివారం మధ్యాహ్నం ఆవులను మేపేందుకు వెళ్లిన సమయంలో, ఎవరూ లేని ప్రదేశంలో అతడిపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో భీమరాజుకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.

దాడి విషయం తెలుసుకున్న భీమరాజు భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న భీమరాజును మెరుగైన వైద్యం కోసం మణుగూరుకు తరలించినట్లు సమాచారం.

భీమరాజుకు భార్యతో పాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై కరకగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ పి.వి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు