ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ వివరణ

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ వివరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హోమ్‌గార్డ్ అని, ప్రస్తుతం రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు డీజీపీ వెల్లడించారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, సర్వీస్ నుంచి తొలగించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మహిళపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి మియాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హోమ్‌గార్డ్ ఆనంద్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు