ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  వినాయక చవితి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం

వినాయక చవితి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం

కరకగూడెం, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా కరకగూడెం గణేష్ ఉత్సవ కమిటీ, కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పోలేబోయిన సుజాతలకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు