అంబేద్కర్‌కు నివాళులర్పించి ఎల్కపల్లి సభకు బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులు
బెల్లంపల్లి, ఆదాబ్ న్యూస్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లిలో నిర్వహించిన సభకు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల రాష్ట్ర నేత నరాల సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్, అర్జున్ ప్రకాష్, పద్మక్క తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం, ప్రజా హక్కుల సాధన కోసం కృషి చేయాలని వారు పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారులు ఎల్కపల్లిలో నిర్వహించిన సభకు బయలుదేరి వెళ్లారు.
Post Views: 36









