ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  రేగళ్ల పంచాయతీ లో వైద్య శిబిరం. డాక్టర్, పి. రవితేజ

 

రేగళ్ల పంచాయతీ లో వైద్య శిబిరం. డాక్టర్, పి. రవితేజ

కరకగూడెం, సెప్టెంబర్ 16 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని మాదన్నగూడెం, రేగళ్ల, పడిగాపురం, చింతలగుంపు గ్రామాల్లో డాక్టర్ పి. రవితేజ ఆధ్వర్యంలో, స్థానిక సర్పంచ్ బాడిషా పార్వతి పర్యవేక్షణలో వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. అలాగే ఆయా గ్రామాల్లో దోమల నివారణకు స్ప్రే కార్యక్రమం చేపట్టారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 102 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా, 12 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ పోలబోయిన కృష్ణయ్య, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, మలేరియా టెక్నీషియన్ సూపర్‌వైజర్ కొమరం అరుణ్ కుమార్, ఆశా కార్యకర్తలు రేణుక, యశోద, సావిత్రి, నీల, పుష్ప, ప్రభావతి, ఉమామహేశ్వరి, సుజాత, మాణిక్యం, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు