తాటిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామంలో నేతకానిల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
Post Views: 210









