ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల ముఖ్య సూచనలు మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: ఎస్‌ఐ పి.వి.ఎన్. రావు

గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల ముఖ్య సూచనలు

మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: ఎస్‌ఐ పి.వి.ఎన్. రావు

ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం: వినాయక చవితి సందర్భంగా కరకగూడెం మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్న ఉత్సవ కమిటీలు, భక్తులు ముందుగా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కరకగూడెం ఎస్‌ఐ పి.వి.ఎన్. రావు సూచించారు.

గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ దరఖాస్తును కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశం, మండపం ఏర్పాటు, భద్రత తదితర అంశాలకు సంబంధించి పోలీసుల తరఫున అవసరమైన సూచనలు, నిబంధనలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

కరకగూడెం మండల పరిధిలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఉత్సవ కమిటీ, భక్తులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

– పి.వి.ఎన్. రావు, ఎస్‌ఐ, కరకగూడెం పోలీస్ స్టేషన్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు